రాష్ట్రస్థాయి పడవ పోటీలలో నంద్యాల ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు పతకాలు

ఈనెల 4,5 తేదీల్లో కర్నూలు లో జరిగిన రాష్ట్రస్థాయి కనోయింగ్ మరియు కయాకింగ్ పడవ పోటీల యందు నంద్యాల పట్టణంలోని PSC &KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించినట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.

డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న డి మహమ్మద్ షరీఫ్ అలాగే ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏపీ గురువర్ధన్, యేసురాజు లు రాష్ట్రస్థాయి కనోయింగ్ మరియు కయాకింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.మహమ్మద్ షరీఫ్ సీనియర్ డ్రాగన్ బోట్ 500 మీటర్స్ నందు సిల్వర్ మెడల్ అలాగే ఎస్ ఏసు రాజు సీనియర్ డ్రాగన్ బోట్ 500 మీటర్ల నందు సిల్వర్ మెడల్ అలాగే ఏటి గురువర్ధన్ జూనియర్ విభాగం నందు 200 మీటర్లు మరియు మిక్స్డ్ 500 మీటర్ల నందు తృతీయ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు.

నంద్యాల-ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ నూతన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శశికళ, వైస్ ప్రిన్సిపల్ వి జె శైలజ రాణి,స్పోర్ట్స్ కమిటీ సభ్యులు విజయానంద్ లు విద్యార్థులను అభినందించారు.విద్యార్థుల విజయానికి కృషి చేసినటువంటి వ్యాయామధ్యాపకుడు కే శ్రీనివాసులు ప్రిన్సిపాల్ శశికళ ఈ సందర్భంగా అభినందించారు.

నవంబర్ 2న నంద్యాలలో జిల్లా స్థాయి ఓపెన్ చదరంగ పోటీలు

I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.