నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నల్లమల అరణ్యంలోని ప్రముఖ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటై భూ కైలాసంగా విరాజిళ్లుతున్న శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను తన ఆహ్వానం మేరకు దర్శనం చేసుకునేందుకు ఈ నెల 16 వ తేదీ గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం వస్తున్నారని ...
నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీ,స్పటిక లింగేశ్వర ఆలయంలోని అమర యోగ వికాస కేంద్రం నందు మంగళవారం ఆశ్వీయుజమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ఉదయం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ...
నంద్యాల పట్టణం శ్రీ చంద్రశేఖర కాళికాంబ దేవస్థానం నందు గీత గోవిందం సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు శ్రీమధ్ భాగవతంపై అవగాహన పరీక్ష నిర్వహించారు.ఈమేరకు ఆదివారం విజేతలకు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ప్రతినెల విద్యార్థులకు ఇతిహాసాలు,పురాణాలపై అవగాహన కల్పించేందుకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గోస్పాడు చిరుధాన్యాల ఉత్పత్తి దారుల కంపెనీ,శమంతకమణి గోఆధారిత ప్రకృతి ...
న్యూ ఢిల్లీ 06-10-2025: పడకేసిన ‘పోలవరం’ పనుల ను పట్టాలెక్కించి, పరుగులు తీయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో ...
నంద్యాల, అక్టోబర్ 06:-స్వర్ణాంధ్ర–స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాను శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సత్సంకల్పంతో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్–2025 జిల్లా స్థాయి బహుమతుల ప్రధాన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీతకాల పరిమితిలోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాల్లో డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అర్జీదారులు ...
జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా ఈనెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు నంద్యాల పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టల్ సూపరిండెంట్ అప్పలస్వామి తెలిపారు. 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు మధ్య పిల్లలకు మాండేటరీ,బయోమెట్రిక్,అప్డేట్స్ కూడా చేయబడునని తెలిపారు.ప్రజలు ఈ ...
ఉపాధ్యాయ దినోత్సవం(సెప్టెంబర్ 5) సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శేషఫణిని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అభినందించారు.ఆదివారం రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ఆధ్వర్యంలో కడప పట్టణం, మద్రాస్ ...
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజ నిర్మాణ శిల్పులని మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం హనీఫ్ నగర్ లోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధనా వృత్తి ...
నంద్యాలలో ఆదివారం నంది రైతు సమాఖ్య రజతోత్సవ వార్షికోత్సవం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య 25 సంవత్సరాల ప్రత్యేక వార్షిక సంచికను అతిథులు, రైతులు, రైతు నాయకులు ఆవిష్కరించారు.నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ...