అమరావతి, అక్టోబర్ 09 :అంబేద్కర్ గురుకులాలు, ఎస్సి సంక్షేమవసతి గృహాల్లో వాటర్ ఇన్ లైన్ క్లోరినేషన్, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో టాటా ట్రస్ట్ ప్రతినిధులు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్ ...
అమరావతి,9 అక్టోబరు:రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ మరియు భుగర్భ గనుల శాఖామాత్యులు కొల్లు రవీంద్ర వెల్లడించారు.ఈమేరకు గురువారం ఎపి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం నివారణకు ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్సుమెంట్ విభాగం సమర్ధవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.నవోదయం కింద ఇప్పటికే 21 ...
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రసన్న అనే విద్యార్థిని.ఈనెల10వ తేదీ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి మారథాన్ పోటీల్లో పాల్గొంటున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శశికళ తెలిపారు.గత నెలలో జరిగిన జిల్లా స్థాయి మారథాన్ పోటీల్లో ప్రసన్న అత్యంత ప్రతిభ కనబరిచినట్లు వారు తెలిపారు..రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రసన్న పాల్గొనడం పట్ల కళాశాల యాజమాన్యం గర్వంగా భావిస్తున్నట్లు ...
నంద్యాల జిల్లా నంద్యాల నందు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గాంధీ నగర్ మీటింగు హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ...
బుధవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన కేంద్రీయ విద్యాలయ తరగతులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.ఈ సందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యకు అధిక ...
నంద్యాల పట్టణంలోని జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నందు మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.యన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి కేవలం ఆదికవి మాత్రమే కాకుండా సమాజానికి సన్మార్గదర్శకుడని, ఆయన బోధనలు నేటికీ సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ...
:అమరావతి 07-10-2025: పట్టణాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నారాయణ అన్నారు…ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులు సకాలంలో పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్లు చొరవ తీసుకోవాలని సూచించారు..మున్సిపల్ కమిషనర్లు,ఇంజినీర్లతో ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మూడు రోజుల పాటు వర్క్ షాప్ జరుగుతుంది…ఈ వర్క్ షాప్ నకు మంత్రి నారాయణ హాజరయ్యారు ...
అమరావతి అక్టోబరు7:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకంలో భాగంగా మైనారిటీల వర్గాలకు చెందిన డ్రైవర్లకు రూ.41.37 కోట్లు లబ్ధి చేకూరిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం అమరావతి లో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ...
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నల్లమల అరణ్యంలోని ప్రముఖ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటై భూ కైలాసంగా విరాజిళ్లుతున్న శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను తన ఆహ్వానం మేరకు దర్శనం చేసుకునేందుకు ఈ నెల 16 వ తేదీ గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం వస్తున్నారని ...
నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీ,స్పటిక లింగేశ్వర ఆలయంలోని అమర యోగ వికాస కేంద్రం నందు మంగళవారం ఆశ్వీయుజమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ఉదయం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ...